
కమలహాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది.
ఆ హీరోయిన్స్ అంటే ఇష్టం
కమల్‌తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం.
సినిమాలు వద్దనుకున్నా..
ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.
చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!