ఓ అమ్మాయి ప్రయాణం

Akshara Haasan Acting In Lady Oriented Movie - Sakshi

కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె, శ్రుతీహాసన్‌ సోదరి అక్షరాహాసన్‌ ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నారు. ‘అచ్చమ్‌ మడమ్‌ నానమ్‌ పయిర్పు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ తమిళ చిత్రంలో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు అక్షర. ఇది ఆమెకు తొలి లేడీ ఓరియంటెడ్‌ మూవీ. ఇందులో ప్రముఖ సింగర్‌ ఉషా ఉతుప్‌ అక్షరాకు బామ్మా పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఓ మధ్యతరగతి అమ్మాయి చేసే ప్రయాణమే ఈ చిత్రకథ. రాజా రమణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రెండ్‌లౌడ్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ‘ఈ కథ మీ అందరికీ చూపించాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు అక్షరాహాసన్‌.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top