
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్చనా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘‘ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్‌తో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’.
ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్త పాత్రలో ఆది కనిపిస్తారు. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాలతో ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శ్వాసిక, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీరామ్ మద్దూరి.