ఈ జబర్దస్త్‌కు ఏమైంది.. ఇలా తిట్టుకుంటున్నారు.. అదిరే అభి ఎమోషనల్ | Adhire Abhi Emotional Comments On Jabardasth Comedy Show | Sakshi
Sakshi News home page

Adhire Abhi: జబర్దస్త్‌కు ఇలాంటి పరిస్థితేంటీ?.. అదిరే అభి ఎమోషనల్

Published Sun, Jan 29 2023 5:57 PM | Last Updated on Sun, Jan 29 2023 6:25 PM

Adhire Abhi Emotional Comments On Jabardasth Comedy Show - Sakshi

జబర్దస్త్ కమెడియన్  అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరినీ నవ్వించే బబర్దస్త్ కామెడీ షోకు దిష్టి తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరి దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని ఎమోషనల్ పోస్ట్ చేశారు. మళ్లీ ప్రేక్షకులను నవ్వించే పాత రోజులు వస్తే బాగుండని అన్నారు. 'జబర్దస్త్ టీం అంతా సంతోషంగా ఉండేవాళ్లమని.. అంతా ఓ కుటుంబం లాగా ఉండేదని.. మాది జబర్దస్త్ ఫ్యామిలీ అని అనేవారు. అలాంటి ఫ్యామిలీ లాంటి జబర్దస్త్‌కు ఎవరో దిష్టి పెట్టారంటూ' ఎమోషనల్ అయ్యారు. 

అందులో ఏముందంటే..

 'జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్‌తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టే కంటిస్టెంట్లు. అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్స్ అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు. ఇవేమీ ఇప్పుడు కనిపించడం లేదని అభి రాసుకొచ్చారు. మళ్లీ పాత రోజులు వస్తే బాగుండునని తన వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. ఎవరైనా ఏదైనా అంటే పడని మేము.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా మంది కమెడియన్స్ ఈ షో నుంచి బయటకొచ్చేసిన సంగతి తెలిసిందే.

అనసూయ, కిరాక్ ఆర్పీ వంటి వాళ్లు ఇప్పుడు షోలో లేరు. అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. దీనికి తోడు.. మల్లెమాల యాజమాన్యం మీద ఆరోపణలు, ఒకరి మీద ఒకరు విమర్శలు వంటివి నచ్చక ఇలా పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement