Adavi Donga Movie Trailer Released- Sakshi
Sakshi News home page

Adavi Donga: షూటింగ్‌లో నా కాలు విరిగిపోయినా డైరెక్ట‌ర్ ప‌ని చేయించాడు: హీరో

Nov 18 2021 6:43 PM | Updated on Nov 18 2021 6:54 PM

Adavi Donga Movie Trailer Released - Sakshi

ఒకానొక దశలో షూట్‌లో నా కాలు విరిగిపోయింది. అయినా సరే డైరెక్టర్ పని చేయించాడు. ఆయన పని రాక్షసుడు. ఆయన అలా ఉంటాడు కాబట్టే..

Adavi Donga Movie Trailer: రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం అడవి దొంగ‌. కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో పర్నిక ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత గోపీకృష్ణ నిర్మిస్తున్నాడు. ఎర్రచందనం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, నిర్మాత ఆరా మస్తాన్ గురువారం రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు కిరణ్ కోటప్రోలు మాట్లాడుతూ.. ‘అన్ని కమర్షియల్ హంగులతో, రియాలిటీకి దగ్గరగా సినిమాను రూపొందించాం. అందరూ ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. 

హీరో రామ్‌తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఒకానొక దశలో షూట్‌లో నా కాలు విరిగిపోయింది. అయినా సరే డైరెక్టర్ పని చేయించాడు. ఆయన పని రాక్షసుడు. ఆయన అలా ఉంటాడు కాబట్టే.. సినిమా చాలా రిచ్‌గా వచ్చింది. ఈ సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement