Actress Shama Sikander Open Up On Casting Couch in Bollywood - Sakshi
Sakshi News home page

Actress Shama Sikander: ‘ఆఫర్స్‌ కావాలంటే మాతో బెడ్‌ షేర్‌ చేసుకోవాలి’

Sep 15 2022 8:27 PM | Updated on Sep 15 2022 9:21 PM

Actress Shama Sikander Open Up On Casting Couch in Bollywood - Sakshi

సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. పైకి ఎంతో అందంగా కనపడినా బయటకి కనిపించని మరకలు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ గురించి ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా సినీ పరిశ్రమలో ఈ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. స్టార్ హీరోయిన్స్ నుంచి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగే హీరోయిన్స్ వరకు ఎంతో మంది వారి వారి అనుభవాలను చెప్పుకున్నారు. తాజా బాలీవుడ్‌ నటి షామా సికిందర్‌ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.

చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి

రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన ఆమె కాస్టింగ్‌ కౌచ్‌పై పెదవి విప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘గతంలో ఉన్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీ అలా లేదు. ఇప్పుడు ఉన్న యువ డైరెక్టర్లు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. నటీనటులకు చాలా రెస్పెక్ట్‌ ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా సేఫ్‌గా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు దర్శక-నిర్మాతలు హీరోయిన్లను తమతో గడపాలంటూ ఇబ్బంది పెట్టేవారంటూ ఆమె షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘అప్పట్లో పేరున్న కొందరు దర్శక-నిర్మాతలు వారితో పని చేయకపోయిన తమతో సన్నిహితంగా ఉండాలని అడిగేవారు. వారి మాటలు నాకు ఆశ్చర్యంగా అనిపించేవి. మీతో కలిసి ఎలాంటి వర్క్‌ చేయనప్పుడు స్నేహంగా ఎలా ఉంటామని అడిగేదాన్ని.

చదవండి: మళ్లీ బుక్కైన తమన్‌.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌

అ‍ప్పుడు వారు నీకు పని కావాలంటే మాతో చనువుగా ఉండాలి. మాతో బెడ్‌ షేర్‌ చేసుకోవాలి అని చెప్పేవారు. అప్పటి హీరోయిన్లు అంతా ఇండస్ట్రీలో అభద్రతా భావంతో ఉండేవారు. అవకాశాలు కావాలంటే దర్శక-నిర్మాతల కోరికలు తీర్చాల్సిందే. అలా చేస్తేనే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. అలా అని ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ లేదని చెప్పను. ఉంది.. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ. ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోటా కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది’ అని ఆమె పేర్కొంది. కాగా షామా సికిందర్‌ ‘యే మేరి లేఫ్‌ హై’, ‘మన్‌ మే హై విశ్వాస్‌’ వంటి టీవీ సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు అమిర్‌ ఖాన్‌ ‘మన్‌’తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె చివరిగా 2019 ‘బైపాస్‌ రోడ్‌’లో నటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement