నెల్లూరు పిల్ల.. ఇండస్ట్రీలో ఔరా అనిపిస్తోంది.. | Actress Baby Kritika Made Name For Herself As Child | Sakshi
Sakshi News home page

బుల్లితెర టు వెండితెర..

Dec 15 2020 8:26 AM | Updated on Dec 15 2020 10:50 AM

Actress Baby Kritika Made Name For Herself As Child - Sakshi

గడుసుదనం.. అల్లరితనం.. పెంకితనం.. పాత్రలో జీవించడం.. బుల్లితెరపై రౌడీపిల్ల.. ఇవన్నీ కలిపితే నటి బేబీ కృతిక గుర్తుకు వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు సౌర్యగా గుర్తింపు పొందిన కృతిక ఐదున్నరేళ్ల వయసులోనే బుల్లితెరపై నటించి అందరినీ ఔరా.. అనిపించింది. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తూ చిన్నతనంలోనే అశేష అభిమానుల్ని సొంతం చేసుకుంది.  
– బంజారాహిల్స్‌ 

►నెల్లూరుకు చెందిన గ్రంధి వంశీకృష్ణ, వరంగల్‌కు చెందిన దూదిపాల స్వప్నల కూతురు కృతిక(9) ప్రస్తుతం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. తండ్రి వ్యాపారి. తల్లి ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు.  

►చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి చూపే కృతిక మొదట గీతాంజలి ధారావాహిక సీరియల్‌లో నటించి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పటికి ఆమె వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా 15 సీరియళ్లు, 10 సినిమాలు, రియాల్టీ షోలలో నటించి మెప్పించింది.  

►ప్రస్తుతం అందరినీ అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్‌లో రౌడీపిల్లగా గుర్తింపు పొందింది. సౌర్యలా(రౌడీ బేబీ) తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. సీరియల్‌లో లీడ్‌ రోల్‌ కృతికదే. ఒకవైపు బుల్లితెర మీద ప్రతిభ చాటుకుంటూనే సినిమాల్లోనూ పెద్ద నటులతో నటిస్తోంది.  

►ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి అగ్రనటి విజయశాంతి ప్రశంసలు అందుకుంది. జైసింహాలో నయనతార చిన్ననాటి పాత్రను పోషించింది. స్టార్‌ మాలో వదినమ్మ, అష్టాచమ్మ, పవిత్ర బంధం, ఈటీవీలో కాంచనమాల తదితర సీరియళ్లతో ఆదరణ పొందుతోంది.  

చదువులోనూ ఫస్ట్‌.. 
నెలలో 10 రోజులు షూటింగ్‌లకు, మిగతా 20 రోజులు స్కూల్‌కు కేటాయిస్తున్న కృతిక.. చదువులోనూ ప్రతిభ చాటుతోంది. బుల్లితెరపై దూసుకుపోతున్న కృతిక ప్రస్తుతం వెండితెరపై కూడా కాల్‌షీట్లు ఖాళీ లేకుండా బిజీగా ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement