
ఫిట్‌నెస్ మీద ఎక్కువగా దృష్టి సారించే మలయాళ నటి అనుశ్రీ తాజాగా స్టెప్పులతో ఇరగదీసింది. వర్కవుట్ సెషన్స్‌లో వచ్చిన చిన్న బ్రేక్‌ను ఇలా డ్యాన్స్ చేసి వినియోగించుకుందన్నమాట. ట్రెడ్‌మిల్ మీద ఆమె హుషారుగా స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గతంలోనూ ఆమె మమ్ముట్టి, సురేశ్ గోపి వంటి నటులను అనుకరిస్తూ చేసిన వీడియో కూడా విపరీతంగా ట్రెండ్ అయింది.
కాగా డైమండ్ నెక్లెస్ చిత్రంతో నటిగా అడుగుపెట్టిన అనుశ్రీ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతి పూవంకోజి సినిమాలో కనిపించింది. అలాగే బుల్లితెర మీద కూడా పలు రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా, జడ్జిగానూ వ్యవహరించింది.