'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్ | Actor Varun Sandesh Comments On Bigg Boss Show And Reveals Why Still They Not Expecting Child - Sakshi
Sakshi News home page

Varun Sandesh On Bigg Boss: 'బిగ్‌బాస్'తో ఇబ్బందులు.. తెలుగు హీరో మొత్తం బయటపెట్టాడు!

Published Sat, Oct 7 2023 6:06 PM | Last Updated on Sat, Oct 7 2023 10:45 PM

Actor Varun Sandesh Comments On Bigg Boss Telugu Show - Sakshi

'బిగ్‌బాస్' తెలుగు రియాలిటీ షోపై టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు ఇబ్బందికి గురయ్యామని చెప్పాడు. తన భార్య వితిక అయితే చాలా సఫర్ అయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? వీళ్లిద్దరూ బిగ్‌బాస్ షోలో ఎప్పుడు పాల్గొన్నారు?

ఏం జరిగింది?
తెలుగులో సరికొత్త ట్రెండ్ చేసిన రియాలిటీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. అయితే ఈ షో మూడో సీజన్‌లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే షోలో కెమిస్ట్రీ పండిస్తూనే కొన్నాళ్లు గొడవపడ్డారు. ఏదైతేనేం ఎంటర్‌టైన్‌మెంట్ బాగానే ఇచ్చారు. అయితే షో చూసి బాగా ఇన్వాల్వ్ అయిన కొందరు ఆడియెన్స్.. వీళ్లిద్దరూ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా కామెంట్స్ పెట్టారట. దీని గురించే వరుణ్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!)

వరుణ్ ఏం చెప్పాడు?
'బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత వితిక చాలా బాధపడింది. అరే నన్ను ఇలా చూపించారు, అలా ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. తనకు వచ్చిన కొన్ని మెసేజుల్ని నాకు చూపించింది. అవి చూసిన తర‍్వాత నాకే బాధేసింది. నిజంగా అలాంటి మెసేజులు పెట్టిన వాళ్లని ఏమనాలో, ఏం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే గంట ఎపిసోడ్‌లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది. రియాలిటీ షోలో మమ్మల్ని చూసి ఎలా జడ్జ్ చేస్తారా అనిపించింది.

'బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చాక వితిక కొన్నాళ్ల పాటు మనిషి కాలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అలాంటి మెసేజులు వచ్చాయి మరి. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని మెసేజులు చేశారు. కొన్నయితే నేను ఆ మాటల్ని అస్సలు చెప్పలేను. అయితే ఆమె సూపర్ ఉమెన్ కాబట్టి తట్టుకోగలిగింది. ఆ ట్రామా నుంచి బయటకు రాగలిగింది'  అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా వితిక బిజీగా ఉండగా, వరుణ్ మాత్రం నటుడిగా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement