ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! | Jawan Movie OTT Release Date And Streaming Details | Sakshi
Sakshi News home page

Jawan OTT: 'జవాన్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. వచ్చేది అప్పుడే!

Oct 7 2023 4:50 PM | Updated on Oct 7 2023 4:57 PM

Jawan Movie OTT Release Date And Streaming Details - Sakshi

స్టార్ హీరో షారుక్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఎందుకంటే గత ఐదేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇతడు.. ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టాడు. చెరో రూ.1000 కోట్ల వసూళ్లు సాధించాడు. థియేటర్లలోకి వచ్చిన నెల దాటిపోయినా సరే 'జవాన్' ఇప్పటికీ ఎంటర్‌టైన్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?)

'జవాన్' సంగతేంటి?
షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తీశాడు. కథ పరంగా చూస్తే చాలా రొటీన్. కానీ స్క్రీన్ ప్లేతో పాటు ప్రతి సీన్‌లోనూ ఎలివేషన్, భారీతనం కనిపించింది. దీంతో సినీ ప్రేక్షకులు మిగతా విషయాల్ని పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేశారు. దీంతో రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చాయి.

బర్త్‌డే నాడు ఓటీటీలోకి
జవాన్ డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పుడు షారుక్ పుట్టినరోజు సందర్భంగా నవంబరు 2న 'జవాన్'ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో లేని సీన్స్‌ని కూడా ఓటీటీ కట్‌లో ఉండబోతున్నాయని సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే ఓటీటీలోనూ 'జవాన్' రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!)

Advertisement
 
Advertisement
Advertisement