తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైకి దక్షిణాన ఉన్న తిరువన్నీయుర్ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటు వేసిన వ్యక్తిగా అజిత్ గుర్తింపు పొందారు. బెల్జియంలో అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీలో విజేతగా నిలిచిన అజిత్.. ఎన్నికల సందర్భంగా బుధవారం ఇండియాకు వచ్చారు. అందరికంటే ముందుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. చెన్నైలోని నీలాంకరై మున్సిపల్ స్కూల్‌లో ఆయన ఓటు వేశారు. ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తన కూతురు శృతి హాసన్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలో నిల్చొని ఓటు వేసిన అనంతరం అందరూ తమ హక్కును ఉపయోగించుకోవాలని కోరారు.
தமிழ்நாட்டின் முதல் ஓட்டு.. முதல் ஆளாய் வாக்களித்த நடிகர் அஜித்! | Tamil Nadu Assembly election | TNElection | Election2026 | Tamilnadu Legislative Assemblyel ection2026 |#Ajith #AK #AjithKumar #TNElection #Election2026 #Electionday #PollingDay #Assemblyelections… pic.twitter.com/AiSrEumptI
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) April 23, 2026
News Tamil Breaking || நீலாங்கரையில் தனது வாக்கை செலுத்திய விஜய்!#Vijay #TVK #TVKVijay #TNElection #Election2026 #Electionday #Assemblyelections #NewsTamil24x7 pic.twitter.com/AnD0dtaQZD
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) April 23, 2026


