Actor Aadi Saikumar Top Gear Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Top Gear Movie: ఆది సాయి కుమార్ 'టాప్ గేర్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Wed, Nov 9 2022 4:11 PM

Aadi Sai Kumar Top Gear Movie Release Date Out - Sakshi

లవ్లీ హీరో ఆది సాయి కుమార్ 'టాప్ గేర్' అంటూ తన కెరీర్‌కు టాప్ గేర్ వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది సాయికుమార్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ ఆది సాయికుమార్ రీసెంట్‌గా అందరినీ మెప్పించారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న టాప్ గేర్ సినిమాతో ఆది సాయి కుమార్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. 

Advertisement
 
Advertisement
 
Advertisement