ట్రయల్‌ స్టార్ట్‌ | Satyadev Trail and Error series launched grandly | Sakshi
Sakshi News home page

ట్రయల్‌ స్టార్ట్‌

Oct 12 2026 4:27 AM | Updated on Oct 12 2026 4:27 AM

Satyadev Trail and Error series launched grandly

ఫరియా అబ్దుల్లా, సత్యదేవ్‌

సత్యదేవ్, రమ్యకష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో ‘ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌’ సిరీస్‌ ఆరంభమైంది. కమల్‌హాసన్‌తో ‘చీకటి రాజ్యం’ వంటి థ్రిల్లర్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేష్‌ సెల్వ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ ఆదివారం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ఈ వేడుకకు నిర్మాత అల్లు  అరవింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

‘‘ఈ సిరీస్‌లో సత్యదేవ్‌ ఛాలెంజింగ్‌  క్యారెక్టర్‌ చేస్తున్నారు. రమ్యకష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు. తనదైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆమె ఈ కథకు మరింత బలం చేకూర్చుతారు. ఫరియా అబ్దుల్లా పాత్ర మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలి పారు. ఇంకా ఈ సిరీస్‌లో విరాజ్‌ అశ్విన్, చైతన్య కష్ణ, వర్ష బొల్లమ్మ, యశ్‌ పూరి, సంపత్‌ రాజ్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement