జిల్లాకేంద్రంలో కేంద్రీయ విద్యాలయం | - | Sakshi
Sakshi News home page

జిల్లాకేంద్రంలో కేంద్రీయ విద్యాలయం

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు, స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టినట్లు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. ఇందులోభాగంగా బుధవారం మెదక్‌ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలతోపాటు పలు ప్రాంతాలను అదనపు కలెక్టర్‌ నగేశ్‌ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు విద్యాశాఖ కో ఆర్డినేటర్‌ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మాట్లాడుతూ..మెదక్‌ పట్టణంలోని ధ్యాన్‌చంద్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆర్ట్‌ డిగ్రీ కళాశాలను సందర్శించామన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న భవనాలు, స్థలాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, జిల్లాలో విద్యా అవకాశాలను మరింత విస్తరించేందుకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కీలకంగా నిలుస్తుందన్నారు.

స్థల పరిశీలన చేసిన అదనపు కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement