నేడు, రేపు ఓటరు నమోదు క్యాంపులు | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ఓటరు నమోదు క్యాంపులు

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

నేడు, రేపు ఓటరు నమోదు క్యాంపులు నేడు డయల్‌ యువర్‌ డీఎం ప్రోగ్రాం ఐటీఐ, ఏటీసీల్లో నేడు ఆఖరి అడ్మిషన్లు 24న స్వర్ణకార శంఖారావం

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులు, గతంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాని వారు, తొలిసారిగా ఓటు హక్కు పొందనున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులతోపాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు, సహాయాన్ని వారు అందిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపులను వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.

నర్సాపూర్‌: ఈనెల 15నాడు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్థానిక ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ రాంమోహన్‌ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. నర్సాపూర్‌తోపాటు చుట్టు పక్కల ప్రజలు ఆర్‌టీసీకి సంబంధించిన సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ఆయన కోరారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కేంద్రాల్లో నేడు ఆఖరి దశ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అడ్వాన్స్‌ సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌(1), అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌(2), బేసిక్‌ డిజైన్స్‌ అండ్‌ వర్టికల్‌ వెరిఫైర్‌(1), బేసిక్‌ డిజైన్స్‌–(1), మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమెషీన్‌(5) సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షుడు పూనా రవిచారి

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వం స్వర్ణకార వృత్తిని పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పూనా రవిచారి డిమాండ్‌ చేశారు. బుధవారం మెదక్‌జిల్లా కేంద్రంలో స్వర్ణకారుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూనరవి మాట్లాడుతూ.. ఈ నెల 24న చేపట్టే స్వర్ణకార శంఖారావం పేరిట హైదరాబాద్‌ భారీ బహిరంగ సభకు జిల్లాలోని స్వర్ణకారులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీఓ నం 272ను సవరణ చేసి అక్రమ రికవరీలను అరికట్టాలన్నారు. 50 ఏళ్లు నిండిన స్వర్ణకారులకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలన్నారు. అనంతరం స్వర్ణకార శంఖారావం పోస్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వెంకట్‌చారి, జిల్లా కార్యదర్శి దామోదర చారి, రాష్ట్ర కార్యదర్శి సతీశ్‌చారి, శ్రీనివాస్‌చారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement