శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో నిర్వహిస్తున్న సంతలో సెల్ఫోన్లు చోరీకి గురవుతున్న విషయంపై ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. ఎస్సై మధుకర్ రెడ్డి బుధవారం శివ్వంపేటలో నిర్వహించిన సంతలో ఇద్దరు కానిస్టేబుళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. శివ్వంపేటతోపాటు గోమారం, కొత్తపేట చౌరస్తా వద్ద నిర్వహిస్తున్న వారంతపు సంతలో సైతం చోరీల నియంత్రణకు ఇద్దరు కానిస్టేబుళ్లతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి చెప్పారు. సంతల్లో పోలీస్ నిఘాకు కృషి చేసిన ‘సాక్షి’దినపత్రికకు ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


