అల్లాదుర్గం( మెదక్): అత్తింటి వేధింపులు భరించలేక ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని గడిపెద్దాపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మోత్తుకపల్లి గ్రామానికి చెందిన సుష్మిత (23)కు, గడి పెద్దాపూర్ గ్రామానికి చెందిన గాజుల అభిలాష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే సుష్మితను భర్త అభిలాష్ ,అత్త శశిరేఖ అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. దీంతో భర్త, అత్తతో నిత్యం గొడవలు జరిగేవి. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన సుష్మిత గురువారం ఇంట్లోనే ఉరివేసుకుంది. సుష్మిత మృతికి భర్తతోపాటు అత్త కారణమని మృతురాలి తల్లి జానాబాయ్ ఆరోపిస్తూ శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


