నేడు, రేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

ఉద్యమకారులను ఆదుకోండి బస్టాండ్‌ స్థలం కబ్జాపై విచారణ నూతన నియామకం రైతు భరోసాకు కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలి

మెదక్‌జోన్‌: మెదక్‌ పట్టణంతో పాటు మెదక్‌, హవేళిఘణాపూర్‌, చిన్నశంకరంపేట మండలాల్లో శని, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మోహన్‌బాబు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు గాను కరెంట్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు స్తంభాలను సరిచేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

రామాయంపేట(మెదక్‌): మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్‌తో పాటు ఇంటి స్థలం కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఫోరం డిమాండ్‌ చేసింది. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించి, తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈనెల 29న గద్వాల జోగులాంబ జిల్లాలో జరిగే సమావేశంలో పెద్దసంఖ్యలో ఉద్యమకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండా ఎల్లం, నిజాంపేట మండల మాజీ ఎంపీపీ సిద్దరాంలు, నాయకులు పోలీస్‌ దేవేందర్‌, నర్సారెడ్డి, రాంరెడ్డి, మెంగర్తి సుధాకర్‌, భిక్షపతి, కిష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అల్లాదుర్గం(మెదక్‌): కబ్జాకు గురైన ఆర్టీసీ బస్టాండ్‌ స్థలంపై విచారణ జరిపిస్తామని మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ విజయ్‌భాస్కర్‌ అన్నారు. శుక్రవారం అల్లాదుర్గం ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. స్థానిక నాయకుడు ప్రయాణికుల కోసం వేయించిన బోరుతో పాటు స్థలం సైతం కబ్జా చేశాడని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బస్టాండ్‌లో మహిళా ప్రయాణికులు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ట్లు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్‌కు కేటాయించిన స్థలంపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. స్థలం చూపిస్తే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని సర్పంచ్‌ తెలిపారు. అల్లాదుర్గం ప్రాంతంలో ఆర్డీనరీ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ఖేడ్‌ డిపో నుంచి జోగిపేట వరకు ఆర్డీనరీ సర్వీస్‌ నడపాలని కోరారు.

నర్సాపూర్‌ రూరల్‌: బీజేపీ ఎండోమెంట్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా నర్సాపూర్‌కు చెందిన కవితారెడ్డిని నియమించారు. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర ఎండోమెంట్‌ కమిటీ శుక్రవారం నిమామకపత్రం అందజేసింది. ఈసందర్భంగా కవితారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధినాయకత్వం నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి.. దేవాలయాల పరిరక్షణకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.

తుది గడువు జూలై 5

జహీరాబాద్‌: కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జూన్‌ 15వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు మాత్రమే ఇందుకు అర్హులని పేర్కొ న్నారు. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవ సాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని వివరించారు. దరఖాస్తుతో పా టు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌ కాపీలను రైతు భరోసా దరఖాస్తు ఫారం జత చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు జూలై 5వ తేదీ చివరి గడువని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement