ప్రమాద బీమా..
మెదక్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా కల్పిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల అకౌంట్ల కనుగుణంగా రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద మరణ బీమా కవరేజీ కల్పించారు. జిల్లాలో 7,500 రెగ్యులర్ ఉద్యోగులు, 3,300 పెన్షన్‌దారులు ఉండగా, సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అయితే సాధారణంగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సామాజిక భద్రత పథకాలు తక్కువగా వర్తిస్తుంటాయి. అందుకే ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. వారు విధి నిర్వహణలో మృతిచెందినా, వైకల్యం పొందినా వారికి ఎలాంటి పరిహారాలు అందేవి కావు. అలాగే వారి స్థానంలో కారుణ్య నియామకాలు కూడా లేవు. ప్రస్తుతం ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల ప్రతిపాదనలు
ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఖాతాలు ఉండటంతో సంబంధిత బ్యాంకులు ఉచిత ప్రమాద బీమా కల్పించడానికి సంసిద్ధత తెలిపాయి. కేటగిరీలు, వేతనాల ఆధారంగా యాక్సిడెంటల్ మరణాలు, వైకల్యానికి పరిహారాలను ప్రతిపాదించాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ప్రమాద మరణ బీమా, అంతే మొత్తాన్ని శాశ్వత వైకల్యానికి పరిహారంగా ఇవ్వనున్నాయి. రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పాక్షిక వైకల్యానికి అందిస్తుండగా, ఇతర కేటగిరీల తాత్కాలిక సిబ్బందికి రూ. 30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు మరణ, వైకల్య కవరేజీలను ఎస్‌బీఐ ఖరారు చేసింది. ఇలా ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా పరిహారం చెల్లించనున్నాయి.
బీమాతో ఆర్థిక భద్రత
రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా వర్తింప చేయడం హర్షనీయం. ఇది ఆర్థిక భద్రత స్కీంగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్య ంలో సాధారణంగా పింఛన్‌దారులు, కుటుంబీకుల ఆదరణ కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. ఈ ప్రమాద బీమా వారిలో ఒక ధీమాను కల్పిస్తుంది.
– మహేందర్‌రెడ్డి, రిటైర్డ్ హెచ్‌ఎం
రూ. కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు చెల్లింపు
రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు వర్తింపు
ప్రమాద మరణ ం.. శాశ ్వత వైకల్యానికి చెల్లింపు


