రోడ్డెక్కిన జొన్న రైతులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన జొన్న రైతులు

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

రామాయంపేట(మెదక్‌): పూర్తిస్థాయిలో జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రామాయంపేటలో మరోసారి రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం జొన్నలను రోడ్డుపై పోసి బైఠాయించారు. తూకం వేయించి లారీల్లో మార్క్‌ఫెడ్‌ గో దాంలకు తరలించిన జొన్నలు నాణ్యతగా లేవనే సాకుతో వాపస్‌ పంపించారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సుమారు ఐదు వేల క్వింటాళ్లకు పైగా జొన్నల స్టాక్‌ నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, సీపీఎం నాయకుడు నీలం బాబు రైతులను పరామర్శించారు. ఈసందర్భంగా పద్మారెడ్డి వ్యవ సాయశాఖ మంత్రి తుమ్మలతో ఫోన్‌లో మాట్లాడి రైతుల బాధలను ఏకరువు పెట్టారు. పూర్తిస్థాయిలో జొన్నలు కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంట మార్పిడి చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతోనే రైతులు జొన్న సాగు చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్‌ బాదె చంద్రం, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement