ఒక్క ఓటూ మిస్‌ కావొద్దు | - | Sakshi
Sakshi News home page

ఒక్క ఓటూ మిస్‌ కావొద్దు

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

మెదక్‌జోన్‌: ఓటరు జాబితాలో నుంచి అర్హుల ఓటు ఒక్కటి కూడా మిస్‌ కాకుండా చూడాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ‘సర్‌’ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను నేరుగా కలిసే అవకాశం లభించిందన్నారు. ప్రతి ఓటరును కలిసి ఓటు నమోదును నిర్ధారించడాన్ని పార్టీ కార్యకర్తలు బాధ్యతగా భావించాలన్నారు. ఈ విషయంపై కార్యకర్తలు, నాయకులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే బీఎల్‌ఓలను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు ఫారుక్‌ హుస్సేన్‌, శేరి సుభాశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్‌, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్‌ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్‌ బట్టి ఉదయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement