తూప్రాన్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని 10వ వార్డు బ్రాహ్మణపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షానే నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో నాచారం దేవాలయ చైర్మన్ రవీందర్ గుప్తా, నాయకులు బుచ్చిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మల్లేశ్, నారాయణగుప్త, కృష్ణ, భగవాన్‌రెడ్డి, వేణు, సత్యనారాయణ, భిక్షపతి, రవి, లక్ష్మణ్, సిద్ధగౌడ్, శ్రీధర్‌గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


