28న పల్స్‌ పోలియో | - | Sakshi
Sakshi News home page

28న పల్స్‌ పోలియో

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

డీఎంహెచ్‌ఓ

మెదక్‌జోన్‌: పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్‌ అధికారులకు ఆదేశించారు. బుధవారం మాత, శిశు ఆస్పత్రిలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఇందులో ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులు 75,496 మంది ఉన్నారని, ఇందుకోసం 457 పోలియో చుక్కల బూత్‌లతో పాటు, మొబైల్‌ టీంలు కలిపి మొత్తం 872 ఏర్పాటు చేశామన్నారు. 1,828 మంది ఏఎన్‌ఎంలతో పాటు ఆశవర్కర్లు, డాక్టర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో మెడికల్‌ అధికారులు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement