డీఎస్పీ ప్రసన్నకుమార్
పాపన్నపేట(మెదక్): మత్తు పదార్థాల వాడకం జీవితాలను నాశనం చేస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. బుధవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కొంత మంది విద్యార్థులు, యువకులు స్నేహితుల నుంచి మత్తు పదార్థాల వాడకం నేర్చుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పట్టణాల్లో ఉన్న డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడు పల్లెలకు పాకిందన్నారు. కొన్ని పాఠశాలలు, కళాశాలలను సైతం తాకిందన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల ప్రవర్తన సరళిపై దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో యువకులు చైతన్యవంతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణమూర్తి, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


