మెదక్‌జోన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనునట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అయితే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందటంతో పాటు ఆటపాటలతో కూడిన విద్య పిల్లలకు అందనుంది.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,076 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో అల్లాదుర్గం, మెదక్, నర్సాపూర్, రామాయంపేట లలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,600 మంది గర్భిణులు, 3,749 మంది బాలింతలుండగా, సున్నా నుంచి మూడేళ్ల వయస్సుగల చిన్నారులు 29,181 మంది ఉన్నారు. 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులు 24,347 మంది ఉన్నారు. కాగా బాలింతలు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యం ఒక్కోగుడ్డు, 200 మి.లీ పాలు, భోజనం అందిస్తారు. అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు నెలకు 16 గుడ్లు, రెండున్నర కిలోల బాలామృతంను ఇళ్లకు పంపిస్తారు. 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే రోజుకో గుడ్డు, పాలు, భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ అందిస్తారు.
ఖాళీల కొరత.. అందని పౌష్టికాహారం!
జిల్లాలో 1,076 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో 1,001 మంది టీచర్లు విధులు నిర్వహిస్తుండగా, 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 1,076 సహాయకుల పోస్టులకు 733 మంది విఽ దులు నిర్వహిస్తున్నారు. కాగా 343 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం టీచర్లు, ఆ యాలు 418 పోస్టులు ఖాళీలు ఉండటంతో ఆ కేంద్రాలకు దగ్గరలో ఉన్నటువంటి ఇతర అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వాటిపై సరైన నిర్వహణ లేకపోవటంతో లబ్దిదారులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో ఖాళీల భర్తీరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఖాళీలు భర్తీ అయితే బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందనుంది.
అంగన్‌వాడీ కేంద్రం
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడో?
పోస్టుల భర్తీకి కసరత్తు
వారంలో విడుదల కానున్న నోటిఫికేషన్
జిల్లా వ్యాప్తంగా 75 టీచర్లు,
343 సహాయకుల ఖాళీలు
భర్తీతో లబ్ధిదారులకందనున్న పౌష్టికాహారం
అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకుల పోస్టులు 418 ఖాళీ ఉండగా వాటిలో సింహాభాగం రిటైర్మెంట్ అయిన వారే ఉన్నారు. రిటైర్మెంట్ టీచర్లకు రూ. 2 లక్షలు, సహాయకులకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం బెనిఫిట్ ఇవ్వాల్సి ఉండగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఎప్పుడిస్తారని నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.


