నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి

Jun 24 2026 9:10 AM | Updated on Jun 24 2026 9:10 AM

తూప్రాన్‌: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్‌ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మనోహరాబాద్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్‌ ప్రారంభించి, ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉండేలా నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు. రెతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, ధ్రువీకరించిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్‌ ఆర్డీఓ బావయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి దేవ్‌కుమార్‌, సర్పంచ్‌ అనూష భాస్కర్‌ యాదవ్‌, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ కీర్తన విఠల్‌ రెడ్డి, ఏడీఏ టెక్నికల్‌ వినయ్‌, ఏడీఏ నర్సాపూర్‌ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ముగింపు దశలో ధాన్యం కొనుగోళ్లు

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని 531 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని, మరో రెండు కేంద్రాలు మాత్రమే మిగిలినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 531 కేంద్రాల్లో ఇప్పటి వరకు 95, 313 మంది రైతుల నుంచి 4,21,083 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే 90,221 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.928.85 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో మరో రెండు కేంద్రాల్లో కొంతమేర ధాన్యం మిగిలి ఉందని, త్వరలోనే పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం దిగుబడి రావడంతో కొనుగోళ్లు ఆలస్యం జరిగిందన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement