సత్వర పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం చూపండి

Jun 23 2026 7:55 AM | Updated on Jun 23 2026 7:55 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజావాణి అర్జీలు వెంట వెంటనే పరిష్కరించాలని డీఆర్వో అంబదాస్‌ రాజేశ్వర్‌ అధికారులకు సూచించారు. సోమ వారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ భారతి 40, ఇందిరమ్మ ఇళ్లు 23, పెన్షన్‌ 4, ఇతర సమస్యలపై 33 కలిపి మొత్తం 100 వినతులు అందజేశారు. ఈసందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. అర్జీలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘సర్‌’ను వెంటనే నిలిపివేయాలి

మెదక్‌ కలెక్టరేట్‌: ‘సర్‌’ పేరిట అనేక కారణా లు చూపుతూ అర్హులైన వారి ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఖాలేఖ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంటనే సర్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement