20 రోజుల క్రితమే 41 క్వింటాళ్ల జొన్నలను కేంద్రానికి తెచ్చాను. తూకం పూర్తయింది. కాగా కేంద్రం మూతపడి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు లారీలో లోడ్ చేయలేదు. గోదాంలకు వెళ్లే వరకు సంబంధిత రైతులదే బాధ్యత ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏం చేయాల్లో అర్థ కాని పరిస్ధితి నెలకొంది.
– గొల్ల కిషన్, రైతు, దంతేపల్లి
నాణ్యత లేదంటున్నారు
తాను 55 క్వింటాళ్ల జొన్నలను తూకం వేయించి లారీలో లోడ్ చేయించాను. వాటిని శుభ్రపరిచి ఎలాంటి మట్టి లేకుండా జాలీ పట్టించి క్లీన్ చేయించిన తర్వాతే తూకం వేయించాను. ఇప్పుడు నాణ్యత సరిగా లేదని వాపస్ పంపించారు. వాటిని ఏం చేసుకోవాలె.
– కంలియా నాయక్, కాట్రియాల తండా


