గ్లోబెల్స్‌ ప్రచారం మానుకోండి | - | Sakshi
Sakshi News home page

గ్లోబెల్స్‌ ప్రచారం మానుకోండి

Jun 23 2026 7:49 AM | Updated on Jun 23 2026 7:49 AM

మెదక్‌జోన్‌: మెదక్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రావు నిరంతరం కృషి చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే రూ. వెయ్యి కోట్లకుపైగా ని ధులు తెచ్చారని తెలిపారు. అలాంటి నాయ కుడిని మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి విమర్శించడం సరికాదన్నారు. కేటీఆర్‌ చేసే గ్లోబల్‌ ప్రచారానికి పద్మారెడ్డి వంతుపాడటం ఎంతవరకు సమంజసమన్నారు. గతేడాది వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోలేదంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని వాపోయారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల సానుభూతి కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు, కొత్త పథకాలను అమలు చేస్తుందన్నారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌, నాయకులు కానుగ భూపతిరాజ్‌, గంగాధర్‌, హఫిజొద్దీన్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement