టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం

Jun 23 2026 7:49 AM | Updated on Jun 23 2026 7:49 AM

ఆ శాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్‌ అన్నారు. సోమవారం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించామన్నారు. అవి టెండర్‌ స్టేజీలో ఉన్నాయన్నారు. ఖిల్లాకు తక్షణ అవసరాల కింద రూ. 57 లక్షలు మంజూరు చేశామన్నారు. కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అరైవ్‌– అలైవ్‌, కంటి పరీక్షల క్యాంపులు, హెల్మెట్‌ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement