మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్‌రావు స్వగ్రామం బొప్పాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. అందులో 1 నుంచి 7వ తరగతి వరకు విద్యను అందిస్తుండగా మొత్తంగా 49 మంది విద్యార్థులున్నారు. క్లాస్‌లకు సరిపడా తరగతి గదులున్నప్పటికీ మూడో తరగతి రేకుల గదిలో కొనసాగుతోంది. దీంతో ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో విద్యార్థులు వేడితో ఇబ్బంది పడుతున్నారు. అలాగే వర్షం కూరిస్తే రేకుల పై పడటంతో శబ్ధం వస్తుంటే క్లాస్ వినడం ఇబ్బందిగా మారుతోంది. అలాగే ఈ పాఠశాలలలో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. విద్యార్థులకు చల్లటి తాగునీటిని తాగేందుకు వాటర్ కూలర్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే 49 మంది విద్యార్థులకు రెండు మూత్రశాలలే ఉన్నాయి.


