నీట్ రీ–ఎగ్జామ్ ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 481 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 423 మంది హాజరయ్యారు. మరో 58 మంది గైర్హాజరయ్యారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగారు. ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. పరీక్షకు వచ్చిన అభ్యర్థుల్లో 90 శాతం బాలికలే కనిపించారు. పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. – మెదక్ కలెక్టరేట్


