యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై యోగాసనాలు వేశారు. నవ శక్తులన్నింటినీ ఏకం చేసి ఏకాగ్రత సాధించడం ఒక్క యోగాకే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సిబ్బంది యోగాసనాలు వేశారు. – మెదక్‌జోన్


