‘ట్రామా కేర్‌’ మంజూరు చేయిస్తా | - | Sakshi
Sakshi News home page

‘ట్రామా కేర్‌’ మంజూరు చేయిస్తా

Jun 22 2026 7:09 AM | Updated on Jun 22 2026 7:09 AM

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం ఆస్పత్రి వద్ద కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఆస్పత్రిలో డెంటల్‌ డాక్టర్‌ ఉన్నా పరికరాలు లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందడం లేదన్నారు. డెంటల్‌ చైర్‌తో పాటు ఎక్స్‌రే తీయడానికి వీలుగా సీఆర్‌ మిషన్‌, ఆర్వో ప్లాంట్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారిపై ఉన్న ఆస్పత్రికి ట్రామా సెంటర్‌తో పాటు గైనకాలజిస్ట్‌ నియామకానికి కృషి చేస్తానన్నారు. కాగా కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ కోసం పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అంతకుముందు ఎంపీ రోగులను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ శివదయాల్‌, సూపరింటెండెంట్లు డాక్టర్‌ లింబాద్రి, హేంరాజ్‌సింగ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మల్లిక, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ శంకర్‌గౌడ్‌, పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, పట్టణశాఖ అధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, సర్పంచ్‌లు యాదగిరిగౌడ్‌, బాల్‌రా జు తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement