హామీలు విస్మరించారు: కె.లక్ష్మణ్‌ | - | Sakshi
Sakshi News home page

హామీలు విస్మరించారు: కె.లక్ష్మణ్‌

Jun 21 2026 7:16 AM | Updated on Jun 21 2026 7:16 AM

కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ విమ ర్శించారు. శనివారం బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్ల పాలనలో దేశంలో సమగ్ర అభివృద్ధి సాధించాడని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి రూ.5500 కోట్లు ఇచ్చిన ఘనత మోదీకే దక్కిందని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement