రెయిన్‌గన్‌తో పంటకు నీరు
టేక్మాల్(మెదక్): 10 రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులంతా పత్తి విత్తనాలు విత్తారు. అప్పటి నుంచి వర్షం లేకపోవడంతో కొన్ని విత్తనాలు మొలకెత్తినా, మరికొన్ని మొలకెత్తలేదు. అదను దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. టేక్మాల్ మండలంలోని పల్వంచలో పదెకరాలకు పైగా పత్తిసాగు చేస్తున్న రైతులు నరేశ్, ప్రవీణ్ తమ పంటను కాపాడుకునేందుకు రెయిన్‌గన్‌తో నీరు అందిస్తున్నారు.
సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవునివ్రత శోభతో అలరారింది. క్షేత్రానికి హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు, కల్యాణాలు, సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ రంగాచారి జాగ్రత్తలు తీసుకున్నారు. – వర్గల్(గజ్వేల్)


