మెదక్‌జోన్: రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని, కోటా మేరకే ధాన్యం సేకరిస్తామనటం ఎంతవరకు సమంజసమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు వరి సాగు చేస్తారని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులు పండించిన ధాన్యం కొనాల్సింది పోయి, మాతో కాదనటం సిగ్గు చేటన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సమావేశంలో నేతలు లావణ్యరెడ్డి, బట్టి జగపతి, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, అంజాగౌడ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి


