మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): రైతులు పండించిన పూర్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం 25 శాతం కొనుగోలు చేసినా, మిగితా ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొనుగోలు చేయాలన్నారు. కేవలం 7 రకాలకే బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. అన్ని సన్న రకాలకు బోనస్ ఇవ్వాలన్నారు. సకాలంలో వరి పంటను కొనక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.
ఖేడ్‌కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్
ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి
నారాయణఖేడ్: ఖేడ్‌కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ మంజూరు కానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను హైదరాబాద్‌లో కలిసినట్లు తెలిపారు. ఖేడ్‌కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఆవశ్యకతను వివరిస్తూ నిధులను మంజూరు చేయాలని కోరగా మంత్రి లక్ష్మణ్ సానుకూలంగా స్పందిచినట్లు వివరించారు.


