నీట్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

నీట్‌కు సర్వం సిద్ధం

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

భారీ బందోబస్తు: ఎస్పీ

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ఈనెల 21న జరిగే నీట్‌ (యూజీ) పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. శుక్రవారం పరీక్ష నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఎగ్జామ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 481 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం జాతీయస్థాయి ఐఐటీలో సీటు సాధించిన హవేళిఘణాపూర్‌ మండలం పోచంరాల్‌ తండాకు చెందిన విద్యార్థి బడావత్‌ రాఘవేందర్‌ శుక్రవారం తన కుటుంబీకులతో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈసందర్భంగా కలెక్టర్‌ అభినందించారు.

జిల్లాలో ఈనెల 21న నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రం పరిసరాల్లో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్షకు అవసరమైన పెన్నులు సెంటర్‌లో అందజేస్తారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో ఒకే పరీక్ష కేంద్రం

హాజరుకానున్న 481 మంది అభ్యర్థులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement