దరఖాస్తుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల వెల్లువ

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

మెదక్‌ అర్బన్‌: ప్రీ ప్రైమరీ బోధకుల పోస్టులకు జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 5న 90 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. బోధకు లకు 1,117 మంది, ఆయా పోస్టులకు 591 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన బోధకుల పోస్టుకు 12 మంది, ఆయాకు ఆరుగురు పోటీ పడుతున్నారు. బోధకులకు రూ. 8 వేలు, ఆయాలకు రూ.6 వేలు జీతం ఇవ్వనున్నారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వనున్నారు.

పెరగనున్న నమోదు శాతం

సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు ప్రభుత్వం గతేడాది జిల్లాలో 30 ప్రీ ప్రైమరీ స్కూల్‌ ్సను ప్రారంభించింది. అంతకుముందు అంగన్‌వాడీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ బడులకు అనుసంధానం కాకపోవడంతో చాలా మంది చిన్నారులు అంగన్‌వాడీ పూర్తి చేయగానే ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లేవారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రీ ప్రైమరీ ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాలో మరో 90 స్కూల్‌ ్స ప్రారంభించారు. 90 మంది బోధకులు, 90 ఆయా పోస్టులను మంజూరు చేశారు. ఇంటర్‌తో పాటు ఉపాధ్యాయ శిక్షణ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, బోధకు ల పోస్టులకు జిల్లాలో అత్యధికంగా రామాయంపేటలో 121, అత్యల్పంగా మా సాయిపేటలో 10 దరఖాస్తులు వచ్చాయి. రామాంతపూర్‌, స్టేషన్‌ మాసాయి పేట పాఠశాలల్లో బోధకుల పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం విశేషం. ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని, మరో రెండు రోజుల్లో వీరికి నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రీ ప్రైమరీ బోధకుల పోస్టులకు తీవ్ర పోటీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement