సేంద్రియ సాగు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగు చేపట్టాలి

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

ఎంపీ రఘునందన్‌రావు

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు పాత పద్ధతిలో సేంద్రియ, ప్రకృతి సాగు చేయాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని తునికి వద్ద గల కేవీకేలో ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రైతు సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేంద్రియ, ప్రకృతి సాగుతో ఆహారం, ఆరోగ్యం బాగుంటుందన్నారు. తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్‌ హెల్త్‌కార్డు ఇచ్చేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2014లో వరికి మద్దతు ధర రూ.1450 ఉంటే నేడు రూ.2385 ధర కల్పించి కేంద్రం ఆదుకుంటుందన్నారు. సాగుతో పాటు కోళ్లు, పశువులు, గేదెలు పెంచాలని కేవీకే హెడ్‌ అండ్‌ సైంటిస్ట్‌ శంభాజీ దత్తాత్రేయ నల్కర్‌, డీఏఓ దేవ్‌కుమార్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు రాకేశ్‌, ఏడీఏ పుణ్యవతి, నర్సాపూర్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బుచ్చేశ్‌యాదవ్‌, నాయకులు గడ్డం శ్రీనివాస్‌, సత్యనారాయణ, సర్పంచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement