పంచాయతీరాజ్‌ పనుల ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌ పనుల ఆకస్మిక తనిఖీ

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పీఆర్‌అండ్‌ఆర్‌డీ జాయింట్‌ డైరెక్టర్‌, మెదక్‌, జగిత్యాల జిల్లాల ప్రత్యేక అధికారి విజయరావ్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిధులు, ఖర్చు వివరాల లావాదేవీలను ఆన్‌లైన్‌ పరిశీలించారు. అనంతరం కౌడిపల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం పనులు పరిశీలించారు. దీంతో పాటు దేవులపల్లి, రాయిలాపూర్‌ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, సీసీరోడ్డు, ఉపాధిహామీ పనులు, కూలీల సంఖ్య ఇతర అంశాలను తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరాతీశారు. పారిశుద్ధ్యం పనులు, తడి పొడి చెత్త సేకరణ పనులను తెలుసుకున్నారు. తనిఖీలకు సంబంధించి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, డీఎల్‌పీఓ సురేష్‌బాబు, డిప్యూటీ సీఈఓ స్వప్న, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎంపీఓ రామారావ్‌, ఏపీఓ పుణ్యదాస్‌, స్థానిక పంచాయతీ కార్యదర్శి నగేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement