ఆరుతడి పంటలతో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలతో ప్రయోజనం

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): వాతావరణ శాఖ సూచనల మేర ఈసారి వర్షపాతం తక్కువ నమోదు కారణంగా రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపాలని మండల వ్యవసాయ అధికారి లావణ్య అన్నారు. గురువారం శివ్వంపేట రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాప్‌ ద్వారానే యూరియా బుక్‌ చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించి రైతు ఫోన్‌ నంబర్‌ వ్యవసాయ సిబ్బంది ద్వారా అప్డేట్‌ చేసుకోవాలన్నారు. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టర్‌ తప్పకుండా చేసుకోవాలని దీని ద్వారానే ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీలు పొందే ఆస్కారం ఉందన్నారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement