బూత్‌స్థాయి అధికారులకు సూచనలు | - | Sakshi
Sakshi News home page

బూత్‌స్థాయి అధికారులకు సూచనలు

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమానికి మెదక్‌ ఆర్డీఓ రమాదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బూత్‌స్థాయి అధికారులతో సమావేశమై, విధులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో నిజాంపేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ రమ్యశ్రీ, ఆర్‌ఐ ప్రీతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల, స్థానిక రెవెన్యూ సిబ్బంది, బూత్‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement