అల్లాదుర్గం(మెదక్): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పెద్దశంకరంపేట పారెస్టు రేంజ్ ఆఫీసర్ హేమచందన అన్నారు. గురువారం అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులకు ‘పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడవులను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. మొక్కలు నాటి వాటిని రక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రమేశ్, అటవీ సిబ్బంది శ్రీనివాస్, అజార్‌బేగ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


