కౌడిపల్లి(నర్సాపూర్): అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్య, పౌష్ఠికాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్ మండల సూపర్‌వైజర్ లక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కొట్టాల్లో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు యూనిఫాం అందజేశారు. అలాగే, వన మహోత్సవంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుమలత, ఉపసర్పచ్ రమేష్, అంగన్‌వాడీ టీచర్ రాజేశ్వరీ, తదితరులు పాల్గొన్నారు.


