ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఎల్‌పీఓ యాదయ్య, ఎంపీడీఓ క్రాంతికుమార్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్‌ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులతో కలిసి సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఉచిత పుస్తకాలను అందిస్తారని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ పట్టణంలోని 6 వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వార్డు కౌన్సిలర్‌ హరిత, అంగన్‌వాడీ టీచర్‌ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ.. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని ఆకాంక్షించారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఎంఈఓ బుచ్చనాయక్‌ కోరారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిమ్మాపూర్‌ పాఠశాలలో బడిబాట, సమూహిక అక్షరాభ్యాసం, వన మహోత్సవం నిర్వహించారు. విద్యార్థులు కావాల్సిన సదుపాయాలు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement