పాపన్నపేట(మెదక్): భవిష్యత్ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జిలు చంద్రశేఖర్, భట్టి అజయ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రం పాపన్నటపేటలో పార్టీ జెండా ఎగుర వేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు తమ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. విద్య, వైద్యం ప్రాధాన్యం అంశాలుగా గుర్తిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్‌చార్జి గణేష్, అపర్ణ, రాజేశ్వరి, మెదక్ నాయకులు రమేష్ గౌడ్, నందకిఫోర్, మండల నాయకులు కృష్ణాగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టళ్లలో
సకల వసతులు
బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఉపేందర్
మెదక్ కలెక్టరేట్: ప్రభు ్వం సంక్షేమ హాస్టళ్లలో సకల వసతులు కల్పిస్తుందని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఉపేందర్ తెలిపారు. గురువారం ఆయన లేకరులతో మాట్లాడారు. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, దుస్తులు, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, కాస్మోటిక్ చార్జీలు అందించాలని వార్డెన్లకు సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు అవసరమైన కాస్మోటిక్ వస్తువులు, దినసరి అవసరాల సామగ్రి వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, విద్యా పురోగతికి ప్రాధాన్యం ఇవ్వాలని, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా అధికారులు, వార్డెన్లు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.
డాక్టర్ శివకు బెస్ట్ సర్వీస్ అవార్డు
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ ధనావత్ శివకు బెస్ట్ సర్వీస్ అవార్డు– 2026కు ఎంపికయ్యారు. యాదాద్రి భవనగిరి జిల్లాకు చెందిన మాతృదేవోభవ పితృదేవ సొసైటీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 21న మాతృదేవోభవ పితృదేవ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా అవార్డును అందించనున్నారు. శివ మాట్లాడుతూ.. తన సేవలకు అందిన గౌరవమని.. ఇక ముందు మరింత బాధ్యతతో తన సేవలను కొనసాగిస్తానని తెలిపారు.


