మొక్కల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని పెద్దశంకరంపేట ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ హేమచందన అన్నారు. గురువారం పెద్దశంకరంపేట అటవీశాఖ కార్యాలయం వద్ద అఽధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెట్లు పెంచితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని పెంచే బాధ్యత కూడా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జంగం రేణుక, సెక్షన్‌ ఆఫీసర్లు రమేష్‌, అంజార్‌, శ్రీను, గ్రామ కార్యదర్శి రాజు, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

అభివృద్ధిలో ముందుకు సాగాలి

పెద్దశంకరంపేట(మెదక్‌): గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగాలని డీఎల్‌పీఓ యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామకార్యదర్శులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని, నాలుగు రకాల చెత్తసేకరణ, నర్సరీల నిర్వహణ, పన్నుల వసూలు, తడి,పొడి చెత్త సేకరణ అంశాలపై చర్చించారు. అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్‌, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్‌, సర్పంచ్‌ జంగం రేణుక, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, గ్రామకార్యదర్శి రాజు, ఏపీఓ సంతోష్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement