శివ్వంపేట(నర్సాపూర్): ఆధ్మాత్మిక చింతనతో మనశ్శాంతి కలుగుతోందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధి కాలేరాం తండాలో నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన తండాల్లో మాలధారణతో పాటు సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణాలతో భక్తిభావాలు పెరగడం సంతోషకర విషయమన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు హరికృష్ణ, చంద్రగౌడ్, మన్సూర్, యాదగౌడ్, రాంమోహన్‌రెడ్డి, వేమారెడ్డి, రాజశేఖర్‌గౌడ్, తండావాసులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


